ఎస్సీ కులం నుండి క్రిస్టియన్ మతానికి మారితే బీసీ-సీ సర్టిఫికెట్ ఇవ్వవచ్చు.
-ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు.
–ఇన్చార్జి తహసిల్దార్ సిరిపురం గిరి.
జనం వాయిస్, సుల్తానాబాద్:
ఎస్సీ కులం నుండి క్రిస్టియన్ మతానికి మారితే బీసీ-సీ సర్టిఫికెట్ ఇవ్వవచ్చునని సుల్తానాబాద్ ఇన్చార్జి తహసిల్దార్ సిరిపురం గిరి స్పష్టం చేశారు. ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి బీసీ సీ సర్టిఫికెట్ కులధ్రువ పత్రాలతో నామినేషన్ వేశారని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామస్తులు ఆరోపించారు.గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బిసి.సి కుల ధ్రువపత్రాలతో నామినేషన్ వేశారని సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కు దిగారు తోగార్రాయి గ్రామ మాజీ సర్పంచులు ఎలక్షన్ కొడ్ ఉండగా ఈ సమయం లో బీసీ సి సర్టిఫికెట్ ఏలా ఇస్తారని ఇన్చార్జి తహసిల్దార్ ను ప్రశ్నించారు. ఇచ్చిన సర్టిఫికెట్ను వెంటనే రద్దు చేయాలన్నారు. దీనివల్ల అసలైన బీసీ కులాలకు చెందిన వారికీ అన్యాయం జరుగుతుందన్నారు. సుల్తానాబాద్ తహశీల్దార్ ను వివరణ కోరగా.. అది నిబంధనల ప్రకారంగానే ఇవ్వడం జరిగిందన్నారు.ఇది రాజ్యాంగం వారికి కల్పించిన హక్కు అని అన్నారు. దీంట్లో ఎలాంటి అవకతవకలు గాని, ఒత్తిడి గాని జరగలేదని స్పష్టం చేశారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments