స్వేచ్ఛాయుత ఓటింగ్‌కు పోలీసుల భరోసా.
-ప్రశాంత ఎన్నికల కోసం పోలీస్ ప్లాగ్ మార్చ్.
-గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్.
–రచ్చపల్లి, ఎగ్లాస్ పూర్, ముత్తారం, అడవి శ్రీరాంపూర్ బేగంపేట్, నాగపల్లి, కమాన్ పూర్ కేంద్రంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్.
జనం వాయిస్, పెద్దపల్లి:
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డిసిపి బి.రామ్ రెడ్డి ఆదేశాల మేరకు గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ పర్యవేక్షణలో మంథని సర్కిల్, కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో మంథని సర్కిల్ పరిధి రచ్చపల్లి, ఎగ్లాస్ పూర్, ముత్తారం, అడవి శ్రీరాంపూర్, ఓడేడు, కేశనపల్లి, బేగంపేట్, నాగపల్లి , కమాన్‌పూర్ మండల కేంద్రంలో స్వేచ్ఛాయుత ఓటింగ్‌కు పోలీసుల భరోసా ప్రశాంత ఎన్నికల కోసం, శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గ్రామాలలో, ప్రధాన వీధులలో ప్లాగ్ మార్చ్‌లో పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ…. శాంతి భద్రతలను బలోపేతం చేయడానికి, ఓటర్లలో నమ్మకం కల్పించేందుకు, ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏసీపీ తెలిపారు. ప్రజలు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా, ధైర్యంతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రత్యేకంగా కోరారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట, డబ్బు-మద్యం పంపిణీ నివారణ, శాంతియుత, స్వేచ్ఛాయుత ఓటింగ్ వాతావరణం లో భయపడకుండా, ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా మీ ఓటు హక్కును వినియోగించు కోవాలని, అదేవిదంగా ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, మండలంలో శాంతి–భద్రతలు భంగం కలగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
ఈ సమావేశంలో ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, మంథని సిఐ బి. రాజు, గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి, రవీందర్, మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రాజకుమార్, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ఎస్ ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments