అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం.
జనం వాయిస్, గోదావరిఖని:
డిసెంబర్ 12 న న్యూ ఢిల్లీ లో జరిగిన అఖిల భారత దళిత్ సమ్మిట్ లో రామగుండం ప్రాంతానికి చెందిన మాల మహానాడు అధికార ప్రతినిధి కడమండ శ్రీహరి కి భారతీయ దళిత సాహిత్య అకాడమీ, న్యూ ఢిల్లీ వారిచే
డా. బి. ఆర్. అంబేద్కర్ ఫెలోషిప్ నేషనల్ అవార్డ్- 2025.అవార్డు ను ప్రదానం చేయడం జరిగింది.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం గోదావరిఖనిలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వ్యాల్ల హరీష్ రెడ్డి పూల మాల వేసి శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం హరీష్ రెడ్డి మాట్లాడుతూ… ఈ సమాజంలో పేరుకు పోయిన కుల వివక్ష పై పోరాటం చేస్తూ జాతి అభ్యున్నతికి పాటుపడుతున్న శ్రీహరి కి అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జహీద్ పాషా, మాజీ కార్పొరేటర్లు ఎన్వి రమణారెడ్డి, బొబ్బిలి సతీష్, మెరుగు చంద్రమౌళి, మాజీ ఉప సర్పంచ్ నర్సింగ్, మహిళ ఉద్యమకారిణి పరుశ స్వాతి, యువజన విభాగ అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మడిశెట్టి రవీందర్, అల్లి గణేష్, శ్రీ హరి, బోట్ల పోషం, నీలం భిక్షపతి, నడిపల్లి సాయి, ఎండీ.అత్తరుదిన్. రహమాన్, గొర్రె నర్సింగ్, గొర్రె శంకర్,,యువరాజ్ నేత,ఉదయ్, శ్రీనివాస్ రావు,బొడ్డుపల్లి రాజు, మోబిన్, కొండ సురేష్, పోయిల రవి, అనిల్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments