EPAPER
Monday, February 16, 2026
Google search engine

హన్మకొండలో బాల వికాస నీటి శుద్ధీకరణ పథకం గ్రామ నాయకుల శిక్షణ కార్యక్రమం.

📰 Generate e-Paper Clip

హన్మకొండలో బాల వికాస నీటి శుద్ధీకరణ పథకం గ్రామ నాయకుల శిక్షణ కార్యక్రమం.

జనం వాయిస్, రామగిరి:

హన్మకొండలో సోమవారం నిర్వహించిన బాల వికాస నీటి శుద్ధీకరణ పథకం గ్రామ నాయకుల శిక్షణ కార్యక్రమంలో రాజాపూర్ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజాపూర్ గ్రామ సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి కొమురయ్య, ఉపసర్పంచ్ కలవేన శ్రీకాంత్ ముదిరాజ్, వార్డు సభ్యులు కాల్వ రజిత–శ్రీనివాస్, కన్నూరి శశికుమార్ లు హాజరయ్యారు.ఈ శిక్షణ కార్యక్రమంలో గ్రామస్థాయిలో స్వచ్ఛమైన తాగునీటి సరఫరా ప్రాముఖ్యత, నీటి శుద్ధీకరణ విధానాలు, ప్లాంట్ నిర్వహణ, ప్రజల ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో బాల వికాస నీటి శుద్ధీకరణ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో గ్రామ నాయకుల పాత్ర కీలకమని నిర్వాహకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.గ్రామ ప్రజలకు నాణ్యమైన, స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాల్గొన్న ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!