విధులు నిర్లక్ష్యం వహించిన రికార్డు అసిస్టెంట్ పి.లక్ష్మణ్ సస్పెండెడ్.
– జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
జనం వాయిస్, పెద్దపల్లి, జనవరి-08:
విధులలో నిర్లక్ష్యం వహిస్తున్న పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయం రికార్డు అసిస్టెంట్ పి.లక్ష్మణ్ ను సస్పెండ్ చేస్తూ *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న పి లక్ష్మణ్ పూర్తి నిర్లక్ష్యపు ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఎటువంటి సమాచారం అందించకుండా విధులకు గైర్హాజరు కావడం, సమయ పాలన పాటించకపోవడం వంటివి గమనించి అనేక సార్లు మెమోలు, శోకస్ నోటీసుల ద్వారా హెచ్చరించినప్పటికీ ఎటువంటి మార్పు చెందకుండా అదే నిర్లక్ష్య ధోరణితో ఉన్నందున రికార్డ్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments