EPAPER
Sunday, February 15, 2026
Google search engine

కళ్యాణ్ స్కూల్ లో సంక్రాంతి సంబరాలు.

📰 Generate e-Paper Clip

కళ్యాణ్ స్కూల్ లో సంక్రాంతి సంబరాలు.

జనం వాయిస్, హైదరాబాద్,జనవరి 10:

పటాన్ చెరు సాయి దర్శిని కాలనీలోని కళ్యాణ్ స్కూల్ పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.  ప్రిన్సిపాల్  థాకూరు కిన్నెర ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందంతో మరియు  విద్యార్థులతో కలిసి సంక్రాంతి సంబరాలను స్కూల్ ఆవరణలో ఏర్పాటుచేసిన భోగి మంటలు, గొబ్బెమ్మలు, రంగురంగుల ముగ్గులు  వేసి బసవన్నల ఆటపాటలతో పల్లెటూరు స్వచ్ఛమైన వాతావరణం తలపించేలాగా ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ప్రాచీన తెలుగు సంస్కృతికి సాంకేతలైన పండుగలు భావితరాల విద్యార్థులకు  మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రతి పండుగల గొప్పతనాన్ని గురించి విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇంద్ర, జారిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!