నేడు మేడారం మహా జాతరకు తెలంగాణ మంత్రుల రాక..!
జనం వాయిస్, ములుగు జిల్లా, జనవరి 11:
మేడారం మహా జాతర ప్రారంభోత్సవానికి ఈనెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు విజయ వంతం చేయాలని పంచా యతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలోనే మేడారం మహా జాతర సందర్భంగా ఈరోజు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, దుద్దుల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు మేడారం చేరుకొని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ఈనెల 18, 19,న మేడారం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండు రోజుల పర్య టన నేపథ్యంలో ఏర్పాట్లపై చర్చించనున్నారు. జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్ పి సుధీర్ రాంనాథ్ కేకన్, భద్రత ఏర్పాట్లను తీసు కున్నారు. మహా జాతర సమీపిస్తుండగా భారీగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments