పందెం కోడి రెడీ..!-గోదావరి జిల్లాల్లో కోడి పందేలు షూరు..
జనం వాయిస్, అమరావతి:
భోగి మంటల సందడి కంటే ముందే గోదావరి జిల్లాలో పందెం కోళ్ళు రణ రంగానికి సై అంటున్నాయి, మును పెన్నడూ లేని విధంగా ఈసారి కోడి పందాల జోరు కొత్త పుంతలు తొక్కుతుం ది, గతంలో గ్రామీణ బరులకే పరిమితమైన ఈ క్రీడా ఇప్పుడు హైటెక్ హంగులు అందుకుంటుంది, పందాలను వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడమే కాకుండా లైవ్ స్ట్రీమింగ్, ఇచ్చేందుకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు.
పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ, కృష్ణా జిల్లాలతో పాటు ఈ ఏడాది ఎన్టీఆర్, బాపట్ల, కాకినాడ, అనకా పల్లి జిల్లాల్లోనూ బరులు రెడీ అవుతున్నాయి. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులే స్వయంగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సంక్రాంతికి కోడి పందేల బరులు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గతేడాది 150 నుంచి 200 బరులు ఏర్పాటైతే ఈసారి 450 వరకు సిద్ధమవుతున్నాయి. భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే మార్గంలో 14 కిలోమీటర్ల పరిధిలోనే 18కి పైగా పెద్ద బరులున్నాయి.
5 నుంచి 10 ఎకరాల్లో బరులు, 2 నుంచి 3 ఎకరా ల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రధాన రహదారులకు సమీపం లోని తోటలు, లేఅవుట్లలో బరులు సిద్ధం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో ప్రతి మండలంలో చిన్నా, పెద్దా కలిపి ఐదారు బరులున్నా యి. అక్కడ బరులకు అనుమతులి ప్పించడం ప్రజాప్రతినిధుల ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా మారింది.
జిల్లా మొత్తంలో ఈసారి 200 బరుల వరకు ఏర్పాటవుతున్నాయి. కోడిపందేలకు పెట్టింది పేరైన పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, ఉండి నియోజకవర్గాల పరిధిలో పదుల సంఖ్యలో బరులు సిద్ధమవుతున్నాయి.ఒకప్పుడు పందేలు నేలపైనే జరిగేవి. ఇప్పుడు పుంజుల కాళ్లకు గాయాలు కాకుండా సింథటిక్ బరులు ఏర్పాటు చేస్తున్నారు. ఒకేసారి 4 వేల నుంచి 5 వేల మంది కూర్చుని తిలకించేలా సిద్ధం చేస్తున్నారు.
నిర్వాహకులు ప్రత్యేకంగా జారీ చేసిన టోకెన్లు ఉన్నవారినే లోపలికి అనుమతించనున్నారు. బయట ఉన్నవారు పోటీలను తిలకించేందుకు ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేస్తున్నారు.రాత్రి వేళ కూడా పందేలు జరిగేలా ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేస్తు న్నారు. ప్రత్యేక అతిథులు సేద తీరేందుకు కారవాన్‌లు ఉంచుతున్నారు.
జనాన్ని నియంత్రించేందుకు బౌన్సర్లను పెడుతున్నారు. ఎవరినీ సెల్‌ఫోన్లతో లోప లికి తీసుకెళ్లనీయ కుండా ప్రవేశ ద్వారం వద్దే డిపాజిట్ చేయించుకుంటారు. పందేల్ని తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల తో పాటు, కర్ణాటకలోని బళ్లారి, గుల్బర్గా, తమిళ నాడులోని కొన్ని ప్రాంతాల నుంచి భారీగా తరలిరానున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments