సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుభాకాంక్షలు.
జనం వాయిస్, భద్రాద్రి కొత్తగూడెం:
సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతి ప్రతి ఇంటిలో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ప్రకృతిని ప్రేమించే, రైతన్నను గౌరవించే గొప్ప పండుగగా సంక్రాంతి నిలుస్తుందని పేర్కొన్నారు. పంట చేతికి వచ్చిన ఆనందంతో రైతులు జరుపుకునే ఈ పండుగ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత పునరుత్తేజాన్ని అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ఆశలు, కొత్త వెలుగులతో ప్రజలు తమ జీవితాలను ముందుకు సాగించాలని, నూతన సంవత్సరంలో జిల్లా అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, సమృద్ధిగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments