అడవి శ్రీరాంపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా దేశిని రాజేశం ఎన్నిక.
జనం వాయిస్, ముత్తారం:
ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దేశ్ని రాజేశం ఏకిగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుదిల్ల శ్రీను బాబు ల ఆదేశాల మేరకు ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఆధ్వర్యంలో అడవి శ్రీరాంపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన శాఖ అధ్యక్షుడిగా దేశిని రాజేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు దేశ్ని రాజేశం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్జీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.ఈ ఎన్నిక కమాన్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య, ముత్తారం మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు వాజీద్ పాషా, గ్రామ సర్పంచ్ అన్నపూర్ణ ఉపేందర్, ఉప సర్పంచ్ అనవేనా హరిత తిరుపతి, వార్డు సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకుల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,నూతన అధ్యక్షుడు దేశిని రాజేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేయాలని, గ్రామంలో కాంగ్రెస్‌ను మరింత బలపడేలా చేయాలని సూచించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments