EPAPER
Monday, February 16, 2026
Google search engine

రూ.299 చెల్లిస్తే ఇంటి వద్దకే మేడారం ప్రసాదం.!

📰 Generate e-Paper Clip

రూ.299 చెల్లిస్తే ఇంటి వద్దకే మేడారం ప్రసాదం.!

జనం వాయిస్, భూపాలపల్లి జిల్లా:

ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహోత్సవం మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర. ఇంటిల్లిపాది తరలివెళ్లి మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర సమీపిస్తున్న వేళ ఇప్పటికే చాలా మంది భక్తులు మేడా రం బాట పడుతున్నారు. ఈనెల 28, 29, 30, 31 తేదీల్లో మహాజాతర జరగనుండగా భక్తులను తరలించేందుకు ఆర్టీసీ అధికారులు సమాయత్తం అవుతున్నారు. జాతర జరిగే మూడు రోజుల ముందు నుంచే ప్రత్యేకంగా బస్సు సర్వీసు లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించా రు.భూపాలపల్లి ఆర్టీసీ డిపో నుంచి వివిధ ప్రాంతాల మీదుగా మేడారానికి భక్తులతను సురక్షితంగా తరలించేం దుకు భూపాలపల్లి ఆర్టీసీ డిపో అధికారులు సన్నద్ధమయ్యారు.
ఈ నెల 25 నుంచి మొదలై జాతర చివరి రోజు ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సులను నడిపించనున్నారు. 8 రోజుల పాటు భక్తులను తరలించేందుకు ప్రత్యేకంగా 340 బస్సులను సిద్ధం చేశారు. రోజుకు సుమారు 50 ట్రిప్పులను నడిపించను న్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇందుకు నాలుగు టికెట్‌ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే వివిధ కారణాలతో మేడారం వెళ్ళలేని భక్తులకు ఆర్టీసీ సంస్థ ప్రత్యేక సౌక ర్యం కల్పించింది, భక్తులకు బంగారం, ప్రసాదం తమ ఇంటి వద్దకే చేర్చేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది, దేవాదాయ సహకారంతో అమ్మవార్ల బంగారం, ప్రసాదం, ప్యాకెట్లలో దేవ తల ఫోటోతో సహా బెల్లం, పసుపు, కుంకుమ, వస్తు వులు అందజేయనున్నారు. ఇందుకుగాను బంగారం ప్రసాదం ప్యాకెట్ పొందాలనుకునే భక్తులు కేవలం 299 రూపాయలు  చెల్లించవలసి ఉంటుంది, భక్తులు వెబ్సైట్లో లాగిన్ అయి సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇతర వివరాల కోసం 040-69440069–040-23450033 నెంబర్లలో సంప్రదించవచ్చని ఆర్టీసీ ఎండి వై నాగిరెడ్డి, తెలి పారు. దీనికి సంబంధించి పోస్టర్ ను శుక్రవారం సాయంత్రం బస్సు భవన్లో ఆవిష్కరించారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!