EPAPER
Monday, February 16, 2026
Google search engine

27-01-2026 మంగళవారం..రాశి ఫలితాలు.

📰 Generate e-Paper Clip

27-01-2026 మంగళవారం..రాశి ఫలితాలు.
—————————————
మేషం

సమాజంలో సేవ కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.  వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు సాధిస్తారు.
—————————————
వృషభం

కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దీర్ఘకాలిక వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.  ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు.
—————————————
మిధునం

ఋణ పరమైన ఒత్తిడిలు మానసిక సమస్యలు కలిగిస్తాయి.  ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన పనులు చాలాకష్టం మీద పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలలో నష్ట సూచనలున్నవి. ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురి అవుతారు.
—————————————
కర్కాటకం

సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.   సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. వ్యాపారాలు  పురోగతిలో సాధిస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
—————————————
సింహం

చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నూతన  వ్యక్తుల పరిచయం లాభిస్తుంది. చేపట్టిన వ్యవహారములలో అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి. వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
—————————————
కన్య

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవహారాలలో  శ్రమాధిక్యత కలుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.  గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి.  వృత్తి, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఆర్ధిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
—————————————
తుల

ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది.  
—————————————
వృశ్చికం

సోదరుల నుండి  శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక వివాదాలు  పరిష్కరించుకుంటారు. సన్నిహితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం  ఉత్సాహాన్నిస్తుంది.
—————————————
ధనస్సు

ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. చేపట్టిన  పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం  కొంత  చికాకు కలిగిస్తుంది. నేత్ర సంభందిత ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి.
—————————————
మకరం

సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం కలుగుతుంది. ఖర్చుకు మించిన ఆదాయం సంతృప్తి కలిగిస్తుంది. వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఉద్యోగమున  ఆశించిన అవకాశములు అందుతాయి.
—————————————
కుంభం

ప్రయాణాలు వాయిదాపడతాయి. జీవిత భాగస్వామితో  అకారణ వివాదాలు కలుగుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తివ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది. 
—————————————
మీనం

ఆర్థిక పరిస్థితి కొంత మెరుగు పడుతుంది.  గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. గృహమున  శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు అనుకూలత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు పొందుతారు.
—————————————


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!