EPAPER
Sunday, February 15, 2026
Google search engine

ధనుష్‌తో మరోసారి జతకడుతున్న సాయిపల్లవి.

📰 Generate e-Paper Clip

ధనుష్‌తో మరోసారి జతకడుతున్న సాయిపల్లవి.

జనం వాయిస్, సినిమా:


కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చేది ‘మారి 2’ చిత్రంలోని రౌడీ బేబీ పాట. ఆ పాటతో పాటు ఇద్దరి మధ్య కనిపించిన కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత ఈ క్రేజీ జోడీ మరోసారి వెండితెరపై కలిసి కనిపించబోతున్నట్లు సమాచారం.
ధనుష్ కెరీర్‌లో 55వ చిత్రంగా తెరకెక్కుతున్న తాజా సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా ఎంపికైనట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో ఇప్పటికే శ్రీలీలను ఒక కథానాయికగా తీసుకోగా, మరో కీలక మహిళా పాత్ర కోసం సాయిపల్లవిని సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అమరన్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న రాజ్ కుమార్ పెరియాస్వామి దర్శకత్వం వహించనున్నాడు. కథ, పాత్ర ప్రాధాన్యాన్ని బట్టి సాయిపల్లవి ఈ సినిమాకు ఒప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం. ధనుష్‌, సాయిపల్లవి కాంబో మళ్లీ రిపీట్ కావడంతో అభిమానుల్లో ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!