చరిత్ర సృష్టించిన బండి సంజయ్.!!
– మొట్టమొదటిసారి కరీంనగర్ లో కాషాయ జెండా.
– మున్సిపల్ కార్పొరేషన్ చరిత్ర సృష్టించిన బండి సంజయ్.
జనం వాయిస్, కరీంనగర్:
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను బీజేపీ కైవసం చేసుకుంది. 60 డివిజన్లకు గాను 33 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. బీజేపీ రెబల్ అభ్యర్థులు కూడా గెలవడంతో ఇక్కడ సునాయాసంగా బీజేపీ విజయం దక్కించుకున్నట్లయింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కార్పొరేషన్ ను బీజేపీ కైవసం చేసుకుంది. కరీంనగర్ కార్పొరేషన్ చరిత్రలో తొలిసారి కాషాయ జెండా రెపరెపలాడనుంది. బండి సంజయ్ ఈ కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తాను కూడా కార్పొరేటర్ నుంచి ఎంపీ స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే. అందుకే అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ తానే దగ్గరుండి చూసుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై ప్రచారంలో విమర్శలు చేస్తూ తమను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి కరీంనగర్ రూపు రేఖలను మారుస్తానని చెప్పారు. ప్రజలు కూడా బండి సంజయ్ కు మద్దతుగా నిలిచారు. దీంతో అత్యధిక స్థానాల్లో బీజేపీ కార్పొరేటర్లుగా గెలవడంతో ఇక్కడ కమలం పార్టీ అభ్యర్థి మేయర్ కానున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments