EPAPER
Monday, July 20, 2026
Google search engine

నిరుద్యోగుల గొంతు కోస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్.

📰 Generate e-Paper Clip

నిరుద్యోగుల గొంతు కోస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్.

  • బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు తీరని అన్యాయం.
  • ప్రధాన పార్టీలు అగ్రవర్ణాల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయి.
  • హుజురాబాద్ కంటస్టెడ్ ఏమ్మెల్యే పిడిశెట్టి రాజు.

జనం వాయిస్, హుజురాబాద్, జూలై 19:

నిరుద్యోగుల గొంతు కోస్తున్న ఈడబ్లూ ఏస్ రిజర్వేషన్స్ బీసీ,ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందని హుజురాబాద్ అసెంబ్లీ కంటస్టెడ్ ఎమ్మెల్యే పిడిశెట్టి రాజు తీవ్ర స్థాయిలో విమర్శించారు.కరీంనగర్ జిల్లా : జూలై 19,(హుజురాబాద్ నియోజకవర్గం / మాజీ ప్రధాని పీ.వీ నరసింహారావు చౌరస్తా )నిరుద్యోగుల గొంతు కోస్తున్న ఈడబ్లూ ఏస్ రిజర్వేషన్స్ బీసీ,ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందని హుజురాబాద్ అసెంబ్లీ కంటస్టెడ్ ఎమ్మెల్యే పిడిశెట్టి రాజు తీవ్ర స్థాయిలో విమర్శించారు.

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చౌరస్తాలో వారు మాట్లాడుతూ..

బీసీల రిజర్వేషన్ల పోరాటం 50% శాతం ఆంక్షలు 1979లో బి.పి. మండల్ కమిషన్ వేసినప్పుడు, దేశంలో 52% ఉన్న బీసీలకు కనీసం 27% రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది.1992లో సుప్రీం కోర్టు ఈ 27% బీసీ రిజర్వేషన్లను సమర్థిస్తూనే, మొత్తం రిజర్వేషన్లు 50 %శాతం దాటకూడదనే రాజ్యాంగంలో లేని ఒక కొత్త నిబంధనను తీసుకువచ్చింది.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి,చివరకు దొంగ బిల్లులతో మోసం చేసిందని ధ్వజమెత్తారు.ఈడబ్ల్యూఎస్ కోటా పేరుతో మ్యాథమెటికల్ మోసం

2019లో తీసుకువచ్చిన 124వ రాజ్యాంగ సవరణ (103వ చట్టం) ద్వారా అగ్రవర్ణాల్లోని పేదలకు (EWS) 10% రిజర్వేషన్లు కల్పించారు.అయితే ఇక్కడే ఒక అతిపెద్ద దగా జరిగిందని అన్నారు.చట్టం ప్రకారం, మొత్తం 100 ఉద్యోగాలు ఉంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీల 50 పోస్టులు పోగా, మిగిలిన 50 ఓపెన్ కేటగిరీ పోస్టులలో మాత్రమే ఈ 10% (అంటే కేవలం 5 పోస్టులు) ఈడబ్ల్యూఎస్ కు ఇవ్వాలి. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ హైకోర్టు కూడా కేవలం జనరల్ కోటాలో నుంచి మాత్రమే ఈడబ్ల్యూఎస్ ఇవ్వాలని స్పష్టమైన తీర్పునిచ్చిందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే లెక్కల ప్రకారమే,తెలంగాణ రాష్ట్రంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయని,రాష్ట్రంలో ఓసీల జనాభా 11.9% కాగా, అందులో ఆర్థికంగా వెనుకబడి ఈడబ్ల్యూఎస్ (EWS) కు అర్హత ఉన్నవారు కేవలం 5.36% మాత్రమే ఉన్నారన్నారు.కేవలం 5.36% ఉన్నవారికి 10% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు.కానీ రాష్ట్రంలో 56.33% జనాభా ఉన్న బీసీలకు దక్కుతున్న రిజర్వేషన్లు కేవలం 27% మాత్రమే అని అన్నారు.అలాగే 17% ఉన్న ఎస్సీలకు 15%, 10% ఉన్న ఎస్టీలకు 7.5% రిజర్వేషన్లు ఇస్తున్నారు.ఒక సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ లో 13 పోస్టులు ఉంటే 3 పోస్టులు ఈడబ్ల్యూఎస్ వారికే వెళ్లాయి లెక్కలు బయటపెట్టారు.తెలంగాణలో రాజ్యాంగ విరుద్ధమైన ఈడబ్ల్యూఎస్ కోటాను (జీవో 65) తక్షణమే రద్దు చేయాలి. దాన్ని రద్దు చేసిన తర్వాతే నూతన ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.జనాభాలో ఎవరెంత శాతం ఉన్నారో,వారికి ఆ మేరకే రిజర్వేషన్లు కల్పించాలన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలన్నీ కేవలం 70 శాతం పైగా అగ్రవర్ణాల చేతుల్లోకే వెళ్తున్నాయని,బీసీ ప్రభుత్వం ఏర్పడితేనే ఈడబ్ల్యూఎస్ రద్దవుతుందని రాజు అన్నారు. ఈకార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం నాయకులు మోతే శ్రీనివాస్, ఆంజనేయులు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!