EPAPER
Sunday, February 15, 2026
Google search engine

ఫిబ్రవరి 17న ఇందిరాపార్క్ వద్ద గీతా వృత్తిదారుల నిరాహార దీక్ష.

📰 Generate e-Paper Clip

ఫిబ్రవరి 17న ఇందిరాపార్క్ వద్ద గీతా వృత్తిదారుల నిరాహార దీక్ష.

-ఉమ్మడి కరీంనగర్  హుజురాబాద్ ప్రాంతాలనుండి గీతా వృత్తిదారులు దీక్షకు తరలి రండి.

-జక్కే వీరస్వామిగౌడ్ రాష్ట వ్యవస్థాపక అద్యక్షులు సర్వాయి పాపన్న మోకుదెబ్బ(గౌడ సంఘము).

జనం వాయిస్, వెబ్ డెస్క్:

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 2026-27 బడ్జెట్ లో గీత వృత్తిదారుల సంక్షేమానికి 5000 కోట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17వ తేదీన కల్లు గీతా కార్మిక సంఘo ఆధ్వర్యంలో అన్ని సంఘాల మద్దతుతో ఇందిరా పార్క్ వద్ద నిరాహారదీక్ష చేస్తున్నామని దీనికి రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిమంది గీతా వృత్తిదారులు పార్టీలకు అతీతంగా వాటర్ బాటిల్ సద్దిమూటతో స్వచ్చందంగా తరలి రావాలని సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము రాష్ట వ్యవస్థాపక అద్యక్షులు జక్కే వీరస్వామిగౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం జమ్మికుంటలో ప్రెస్ నోట్ విడుదల చేసి మాట్లాడుతు చెట్టు మీదికెల్లి పడి పిట్టల్లా రాలి పోతున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు ఐన లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలకు పైగా అవుతున్న 830 పై గీతా వృత్తిదారులకు ఎక్సగ్రేషియా రాక ఎదిరి చూస్తున్నారని తక్షణమే బడ్జెట్ విడుదల చేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర బడ్జెట్లో గీత వృత్తిదారులకు ప్రతిసారి అన్యాయమే జరుగుతుందన్నారు. గత సంవత్సరం బడ్జెట్లో 70 కోట్లు మాత్రమే కేటాయించారు అవి కూడా డబ్బులు లేవనే పేరుతో విడుదల చేయలేదు. కేవలం 17 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఈ సంవత్సరం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లోనైనా 5 వేల కోట్లు కేటాయించి గీత వృత్తిదారుల సంక్షేమానికి ఖర్చు చేయాలని వీరస్వామిగౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గీత కార్మికులకు అనేక హామీలు ఇచ్చింది. పెన్షన్ 2 వేల నుండి 4 వేలకు పెంచుతామని ఎక్సిగ్రేషియా 10 లక్షలకు పెంచుతామని అదికూడా నెల రోజుల లోపే ఇస్తామని హామీ ఇచ్చి ఇంత వరకు కూడా ఇవ్వటం లేదని మండి పడ్డారు.ఈ విషయమై స్వయంగా ముఖ్యమంత్రి గారికి మరియు అనేకసార్లు అధికారులకు మంత్రుల దృష్టికి తీసుకుపోయామని ఐన స్పందన లేదని అందుకే ఈ మహాధర్నా అన్ని సంఘాల మద్దతుతో నిర్వహిస్తున్నామని వీరస్వామిగౌడ్ అన్నారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి చేసి హక్కులు సాధించేందుకు హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్షకు పూనుకున్నామని ఈ కార్యక్రమంలో గీత వృత్తిదారులు శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రాంతం నుండి తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!