- భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ రైడ్స్.
- -లంచం తీసుకుంటూ దొరికిన సిబ్బంది.
- జనం వాయిస్, భూపాలపల్లి:
- భూపాలపల్లి జిల్లాలో లంచం తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ప్రభుత్వ సిబ్బందిని ఎక్కడికక్కడ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబి అధికారులు పట్టుకుంటున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికారు భూపాలపల్లి జిల్లా కోర్టు సిబ్బంది. భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ రైడ్స్ నిర్వహించగా రూ. 5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. స్టెనోగ్రాఫర్ సాయి చరణ్, సిబ్బంది పున్నం రజిత, కొమ్ము సునీతలను అదుపులోకి తీసుకున్నారు. ఓ కేసుకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు ఇచ్చేందుకు న్యాయవాదిని లంచం డిమాండ్ చేశారు. దీంతో న్యాయవాది గోపాలరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ తో ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా కోర్టు సిబ్బందిని పట్టుకున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments