EPAPER
Tuesday, October 13, 2026
Google search engine
- Advertisment -spot_img

బొమ్మాపూర్–3 ఇసుక క్వారీలో అడుగడుగునా అక్రమాల ఆరోపణలు.

📰 Generate e-Paper Clip

బొమ్మాపూర్–3 ఇసుక క్వారీలో అడుగడుగునా అక్రమాల ఆరోపణలు.

లోడింగ్ చార్జీల పేరుతో వసూళ్లు.. అనుమతులు లేకుండానే కాంటా నిర్వహణ?

అక్రమంగా విద్యుత్ విచ్చల విడిగా దుర్వినియోగం.

జనం వాయిస్, మహాదేవపూర్, ఆగస్టు 07:

మహాదేవపూర్ మండలంలోని బొమ్మాపూర్–3 ఇసుక క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక లోడింగ్ పేరుతో అదనపు వసూళ్లు చేస్తున్నారని, కాంటా నిర్వహణకు అవసరమైన అనుమతులు లేకుండానే కార్యకలాపాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక లోడింగ్‌కు ప్రత్యేకంగా ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ, లోడింగ్ పేరుతో వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే క్వారీలో జేసీబీల వినియోగం, కాంటా నిర్వహణ తదితర అంశాలపై కూడా నిబంధనలు పాటిస్తున్నారా? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, క్వారీలో విద్యుత్‌ను నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాలపై సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. క్వారీ నిర్వహణపై పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఈ అంశాలపై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోందని పలువురు అంటున్నారు. కాంటా నిర్వహణకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? వసూలు చేస్తున్న మొత్తాలకు అధికారిక అనుమతి ఉందా? విద్యుత్ వినియోగానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నారా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు బొమ్మాపూర్–3 ఇసుక క్వారీలో సమగ్ర తనిఖీలు నిర్వహించి, నిబంధనల ఉల్లంఘనలు ఉంటే సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని మహాదేవపూర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!