EPAPER
Tuesday, March 3, 2026
Google search engine

ఇద్దరు మగ కవల పిల్లలు, ఇద్దరు ఆడ కవల పిల్లల కు ఘనంగా పెళ్లి.

📰 Generate e-Paper Clip

  • ఇద్దరు మగ కవల పిల్లలు, ఇద్దరు ఆడ కవల పిల్లల కు ఘనంగా పెళ్లి.
  • – నిజాంబాద్ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.
  • జనం వాయిస్, నిజామాబాద్‌ :

ఒకటి కాదు రెండు జంటలు కవలలైన యువకులిద్దరు..కవలలైన అమ్మాయిలను ఒకే ముహూర్తానికి వివాహమాడారు. అదీ.. అంతర్జాతీయ కవలల దినోత్సవం రోజున.జరిగిన అరుదైన వివాహ మహోత్సవానికి కామారెడ్డి జిల్లా కేంద్ర శివారు లింగాపూర్‌లోని కల్యాణ మండపం వేదికగా నిలిచింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌కు చెందిన దుంపటి విజయ్‌కుమార్,
వినయ్‌కుమార్‌లిద్దరూ కవలలు. వీరికి ఇదే జిల్లా తాడ్వాయి మండలం దేమీకలాన్‌ గ్రామానికి చెందిన కవలలు కుమ్మరి కీర్తన, కీర్తితో పెద్దలు వివాహం నిశ్చయించారు. రెండు జంటలు బంధుమిత్రుల సమక్షంలో, వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యాయి. నవదంపతులు విజయ్‌కుమార్‌-కీర్తన, వినయ్‌కుమార్‌-కీర్తి అందరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!