- జీడికే 11 ఇంక్లెన్ లో ప్రమాదం..కార్మికుడికి గాయాలు.
- చికిత్స కోసం ఏరియా హాస్పిటల్ కు తరలించిన గని యాజమాన్యం.
- కార్మికుడి ని పరామర్శించిన ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ మరియు నాయకులు.
- మైరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ కు రెఫర్ చేసిన యాజమాన్యం
- జనం వాయిస్, గోదావరిఖని:
- సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జీడికే 11 ఇంక్లైన్ లో బుధవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగి కోల్ కట్టర్ కార్మికుడు ఐలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గనిలో బ్లాస్టింగ్ అనంతరం చెటాయి చేస్తుండగా సైడ్ ఫాల్ కావడంతో కార్మికుడికి నడుము , కుడికాలుపై బొగ్గు పెల్లలు పడి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన కార్మికున్ని గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్ కి తరలించిన విషయం తెలిసిన వెంటనే గుర్తింపు సంఘం ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, జి.ఎం.కమిటి మెంబర్ సిద్దమల్ల రాజు, గని ఫిట్ సెక్రటరీ నాయిని శంకర్ లు ఏరియా హాస్పిటల్ కు వెళ్లి గాయపడిన కార్మికుడిని పరామర్శించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ కు రెఫర్ చేయాలని వారు ఏరియా హాస్పిటల్ డాక్టర్ లకు కోరగా వారు కార్మికుడి ని హైదరాబాద్ కు పంపించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments