పులివెందుల రూరల్ సిఐ, ఎస్ఐ లు అరెస్టు.
జనం వాయిస్, కడప:

పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ ఇళ్లలో ఏసీబీ అధికారుల సోదాలు రెండు రోజులపాటు కొనసాగాయి. మంగళవారం రాత్రి వరకు చేసిన సోదాల్లో 6 లక్షల రూపాయల నగదు, బ్యాంకు లాకర్ కి, నంద్యాలలోని డూప్లెక్స్ ఇంటికి సంబంధించిన పత్రాలు, 200 గ్రాముల బంగారు ఆభరణాలు, కొన్ని విలువైన పత్రాలు, 54 మద్యం సీసాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిఐ వెంకటరమణ ఇంటి నుంచి పత్రాలు తీసుకెళ్తున్న హోంగార్డును అదుపులోకి తీసుకొని, అతని వద్ద ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో నివాసముంటున్న సీఐ వెంకటరమణ తల్లిదండ్రుల ఇంటిలో కూడా సోదాలు చేసారు. సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ లో పులివెందుల డిఎస్పి మురళి నాయక్ ను ఏసీబీ అధికారులు విచారించారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన వెంకటరమణ, ఎస్ఐ అనిల్ కుమార్ లను అరెస్టు చేసే కర్నూలు ఏసీబీ కోర్టుకు తరలించారు. విచారణ కొనసాగుతోందని… విచారణ పూర్తయ్యాక పూర్తి సమాచారం ఇస్తామని ఏసీబీ డీఎస్పీ సీతారామారావు అన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments