సాఫ్ట్‌వేర్ నుండి వెండితెర వైపు..
– చిన్ననాటి కలని నెరవేర్చుకున్న హుజురాబాద్ యువకుడు రుద్రారపు ప్రశాంత్.
జనం వాయిస్, హుజురాబాద్:
హుజూరాబాద్ పట్టణం విద్యానగర్‌కు చెందిన రాధారపు ప్రశాంత్ తన చిన్నప్పటి నుండి వెండితెరపై మెరవాలన్న కలని నిజం చేసుకున్నాడు. సినిమా రంగంపై ఉన్న మక్కువతో, ఆ యవకుడు అమెరికాలో స్థిరపడ్డ తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకుని, సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. తాజాగా ప్రశాంత్ హీరోగా నటించిన ‘రవం’ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో విడుదలకు సిద్ధమైంది. పాడాల తారక రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ మన్నార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా ప్రశాంత్ తన నటనాప్రతిభనుచాటుకోనున్నారు. ఈ నెల 6న సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సందర్భంగా, హుజూరాబాద్‌లో ప్రశాంత్ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా అతనికి మరిన్ని విజయాలు కలగాలని మిత్రులు బంధువులు శ్రేయోభిలాషులు కోరుకుంటున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments