EPAPER
Monday, March 23, 2026
Google search engine

మోదీకి చంద్రబాబు అభినందనలు

📰 Generate e-Paper Clip

మోదీకి చంద్రబాబు అభినందనలు

– చారిత్రక సేవా మైలురాయిపై ప్రశంసలు.

– సుదీర్ఘ కాలం సేవలకు అభినందనలు.

– వికసిత భారత్ దిశగా నాయకత్వంపై ప్రశంస.

– దేశ ప్రగతికి అంకితభావం అంటూ కొనియాడిన సీఎం.

జనం వాయిస్, అమరావతి:

భారత చరిత్రలోనే సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగుతున్న నేతగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దేశానికి 8,931 రోజుల పాటు సేవలందిస్తూ చారిత్రక మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా సేవలందించడం ఒక గొప్ప ఘనతగా అభివర్ణించారు. దేశ అభివృద్ధి, శ్రేయస్సు కోసం మోదీ చూపుతున్న అంకితభావం, దార్శనిక నాయకత్వం ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. ‘దేశానికి 8,931 రోజుల సేవ పూర్తి చేయడం నిజంగా అద్భుతమైన విజయమని, ఇది ఆయన నిరంతర కృషికి నిదర్శనం’ అని చంద్రబాబు తెలిపారు. దేశాన్ని ముందుకు నడిపించడంలో మోదీ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. అలాగే 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించాలన్న మోదీ దార్శనికత దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపుతోందని అన్నారు. దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దిశగా ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీకి మరింత శక్తి, ఆరోగ్యం కలగాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో ఆయన నాయకత్వం కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!