EPAPER
Friday, April 17, 2026
Google search engine

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.

📰 Generate e-Paper Clip

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.

లంచం తీసుకుంటూ చిక్కిన హుజురాబాద్ మునిసిపాలిటీ ఏఈ.

జనం వాయిస్, హుజురాబాద్:

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీలో అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ నుసుం సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. బుధ‌వారం హుజూరాబాద్ ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద కాంట్రాక్టర్ నుంచి రూ.50,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన వర్షపు నీటి కాలువ పనులకు సంబంధించిన మెజర్‌మెంట్ బుక్ (ఎంబీ) నమోదు చేసి తుది బిల్లును ప్రాసెస్ చేయడానికి లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారు పక్కా ప్రణాళికతో నిందితుడి వద్ద నుంచి లంచం తీసుకుంటుండ‌గా ప‌ట్టుకున్నారు. ఈ మేర‌కు నిందితుడిని అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. అలాగే లంచం డిమాండ్ చేసే ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచించింది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!