EPAPER
Wednesday, June 3, 2026
Google search engine

శ్రీముఖి రెమ్యునరేషన్ హాట్ టాపిక్

📰 Generate e-Paper Clip

శ్రీముఖి రెమ్యునరేషన్ హాట్ టాపిక్

జనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 16:

బుల్లితెరపై తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం అత్యధిక క్రేజ్ ఉన్న మహిళా యాంకర్లలో ఒకరిగా నిలిచింది. ప్రముఖ యాంకర్ సుమ కనకాల తర్వాత అదే స్థాయిలో గుర్తింపు సంపాదించిన యాంకర్‌గా ఆమె పేరు వినిపిస్తోంది. టెలివిజన్ రంగంలో ‘పటాస్’ వంటి షోతో గుర్తింపు పొందిన శ్రీముఖి, ఆ తర్వాత అనేక రియాలిటీ షోలు, ఎంటర్టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా తన క్రేజ్‌ను పెంచుకుంది. సినిమాల్లో కూడా కొన్ని కీలక పాత్రల్లో నటిస్తూ తన ప్రతిభను చాటుకుంది. ముఖ్యంగా ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో రన్నరప్‌గా నిలవడం ఆమె కెరీర్‌కు మరింత బలం చేకూర్చింది. ప్రస్తుతం టీవీ షోలు, సినిమా ఈవెంట్లు, ప్రైవేట్ ఫంక్షన్లతో బిజీగా ఉన్న శ్రీముఖి, తన పాపులారిటీకి తగ్గట్టుగానే భారీ పారితోషికం తీసుకుంటోంది. ఒక్కో టెలివిజన్ షో లేదా ఈవెంట్ కోసం ఆమె దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లకు హోస్ట్‌గా వ్యవహరించేందుకు రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నెలకు పలువురు టీవీ షోలు, 3 నుంచి 4 సినిమా ఈవెంట్లు నిర్వహించడం వల్ల ఆమె నెలవారీ ఆదాయం సుమారు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ఈటీవీ, స్టార్ మా వంటి ఛానెళ్లలో పలు కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న శ్రీముఖి, తన మాట తీరు, టైమింగ్, వినోదంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు, ఈవెంట్ నిర్వాహకులు కూడా ఆమెకు భారీ పారితోషికం ఇవ్వడానికి వెనకాడడం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!