డీఎంహెచ్ఓ కార్యాలయ సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్.
– జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
– జీత బిల్లులు ప్రాసెస్ చేయడానికి నగదు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు.
జనం వాయిస్, పెద్దపల్లి, ఏప్రిల్-23:
జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DMHO) కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.డి. అజీమ్ ఖాన్‌తో పాటు సీనియర్ అసిస్టెంట్ ఓ. రాము ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కొత్తగా నియమితులైన ల్యాబ్ టెక్నీషియన్ల జీతాలు IFMS పోర్టల్‌లో ప్రాసెస్ చేయడం కోసం సంబంధిత అధికారులచే నగదు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ నిర్వహించగా, సూపరింటెండెంట్ ఎం.డి. అజీమ్ ఖాన్ మరియు సీనియర్ అసిస్టెంట్ ఓ. రాము జీత బిల్లులు సిద్ధం చేయడం, ప్రాసెస్ చేయడం విషయంలో అక్రమాలు, అధికార దుర్వినియోగం చేసినట్లు తేలినట్లు పేర్కొన్నారు. విచారణలో భాగంగా ల్యాబ్ టెక్నీషియన్ల నుంచి నగదు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో పాటు, సంబంధిత వివరాల్లో అవకతవకలు గుర్తించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు ప్రారంభించినట్లు కలెక్టర్ వెల్లడించారు. అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల పరిశీలన మేరకు, సూపరింటెండెంట్ ఎం.డి. అజీమ్ ఖాన్ మరియు సీనియర్ అసిస్టెంట్ ఓ. రాము ను తక్షణ ప్రభావంతో సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. సస్పెన్షన్ కాలంలో సంబంధిత అధికారులు ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ను వీడరాదని, నిబంధనల ప్రకారం సబ్సిస్టెన్స్ అలవెన్స్ చెల్లించబడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments