రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు చిత్రపటాలకు ఉద్యమకారుల పాలభిషేకం.
16న ఆర్ట్స్ కాలేజీ సభ విజయవంతం చేయండి.
జనం వాయిస్, మంథని, సెప్టెంబర్ 1:
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం,గుర్తింపు కార్డు,పెన్షన్, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఆరోగ్య పథకం అమలుతో పాటు కేకే కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి అంగీకరించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం మంథని లో పాలాభిషేకం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి కావటి సతీష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు చిత్రపటాలకు స్థానిక అంబేద్కర్ చౌక్ లో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే సెప్టెంబర్ 16న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞత సభ నిర్వహించనున్నట్లు కావటి సతీష్ తెలిపారు. ఈ సభకు తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు మిరాల రామిరెడ్డి, సాదుల శ్రీను, అజీమ్ ఖాన్, ఎస్.కె. ముజీబ్, ముస్కె ఈశ్వరమ్మ, కాసిపేట మల్లేష్, బర్ల సుధాకర్, దాసరి శంకర్, తోకల మల్లేష్, మధుకర్ రెడ్డి, ఆనంద్, అలీమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments