EPAPER
Friday, April 24, 2026
Google search engine

ముత్తారం తహసిల్దార్ కార్యాలయ నిర్మాణం వేగవంతం చేయాలి.

📰 Generate e-Paper Clip

ముత్తారం తహసిల్దార్ కార్యాలయ నిర్మాణం వేగవంతం చేయాలి.

– కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
– జూన్ 2 నాటికి కార్యాలయం ప్రారంభం లక్ష్యం.
– పాఠశాల అభివృద్ధి పనులు వేసవిలో పూర్తి చేయాలి.
– ఫీల్డ్ స్థాయిలో పనుల పరిశీలన.

జనం వాయిస్, ముత్తారం, ఏప్రిల్ 24:

ముత్తారం మండలంలో నిర్మాణంలో ఉన్న నూతన తహసిల్దార్ కార్యాలయ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలో ఫీల్డ్ పర్యటన నిర్వహించిన ఆయన నిర్మాణ పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తహసిల్దార్ కార్యాలయ నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులను వేగవంతం చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నాటికి కార్యాలయాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గడువులోగా పనులు పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
అలాగే మండలంలో కొనసాగుతున్న పాఠశాల అభివృద్ధి పనులపై కూడా కలెక్టర్ సమీక్షించారు. మొత్తం 28 పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేసవి సెలవుల్లో పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థులకు సిద్ధంగా ఉంచాలని సూచించారు. పాఠశాలల్లో పెయింటింగ్, మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అన్ని పనులు సమయానికి పూర్తి కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కల్పించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఈ పర్యటనలో తహసిల్దార్ మధుసూదన్, ఏఈ పీఆర్ జగదీష్ తదితర అధికారులు పాల్గొన్నారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎక్కడా ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!