- అడవిశ్రీరాంపూర్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కు మంత్రి శ్రీధర్ బాబు కు ఆహ్వానం.
- ఆహ్వాన పత్రిక అందజేసిన అడవి శ్రీరాంపూర్ గౌడ కులస్తులు.
- జనం వాయిస్, ముత్తారం, మే 04:
- ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ జమదగ్ని ముని సమేత శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి యంత్ర ప్రతిష్టాపన మే 9 వ తారీకు శనివారం రోజున జరగనుంది. ఈ కార్యక్రమానికి రావాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ను హైదరాబాదులోని మంత్రి నివాసంలో కలిసిన గౌడ కులస్తులు ఆహ్వాన పత్రిక అందజేశారు. విగ్రహ ప్రతిష్టాపనకు రావలసిందిగా మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ తో పాటు గౌడ కులస్తులు కూనూరి సత్యనారాయణ గౌడ్, గట్టు సదయ్య గౌడ్, వీరగోని సంతోష్ గౌడ్, బండి క్రాంతి కుమార్ గౌడ్ మరియు వార్డు సభ్యుడు వీరగోని అంజి గౌడ్ తదితరులు ఉన్నారు.
- సెంట్రల్ లైటింగ్ మంజూరు.
- ఈ సందర్భంగా దేవాలయం ఆవరణలో సెంట్రల్ లైటింగ్ కోసం మంత్రి శ్రీధర్ బాబు ను కోరగా వెంటనే మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి కి అడవి శ్రీరాంపూర్ గ్రామ గౌడ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments