EPAPER
Tuesday, June 2, 2026
Google search engine

మ్యాం (గో) మెరుపు….దగా..!!

📰 Generate e-Paper Clip

మ్యాం (గో) మెరుపు….దగా..!!

చూస్తే పసిడి వర్ణం…లోన ఘోర విషం!

కార్బైడ్ వేడి మాయకు పసుపు పచ్చని ఆకర్షణం..

కృత్రిమ మామిడి.. ఆరోగ్యానికి డేంజర్!!

ఇదీ మ్యాంగో కల్తీ…ఒక సిత్రం రీల్!!

బహిరంగ మార్కెట్లలో క్రయవిక్రయాలు..

జనం వాయిస్, డెస్క్, ఫణి కుమార్ సీనియర్ జర్నలిస్ట్:

చూస్తే పసిడి వర్ణం…లోన మాత్రం ఘోర విషం!.. చెట్టు తొడిమ నుండి రాలకముందే…కృత్రిమ రసాయనాలతో పండిన పండు.. మామిడి తీపి వశం అయింది..
మాయమై,కార్బైడ్ వేడి మాయకు పసుపు పచ్చని ఆకర్షణీయమైన రంగు…కానీ, ప్రాణాలకు తెచ్చే తీవ్ర భంగం.. సహజ ఎండలో మాగితేనే అమృతం…కల్తీ రసాయనం తింటేనేమో అనర్థం!

మ్యాంగో…ఒక సిత్రం..

ఇదీ మామిడి…. ఇలాంటి మ్యాంగో కథ.. ఒక సిత్రం రీల్ నే తలపిస్తుంది .. ఉమ్మడి రంగారెడ్డి పాలమూరు జిల్లాలో ఈ పంట అధికంగా ఉండడంతో  దళారులు రైతన్నల పై దృష్టి సారించారు.
మాటలతో ప్రలోభ పెట్టి.. డబ్బులను అడ్వాన్స్ గా ఎరా చూపుతూ తీసుకున్న మామిడిని కార్బోహైడ్రేట్ ఇతరత్ర రసాయన పదార్థాలతో మాగపెట్టి మార్కెట్లో బహిరంగ విషం చిమ్ముతున్నారు. ఇలాంటి వ్యాపారంపై దృష్టి పెట్టాల్సిన సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడం విమర్శలకు దారి తీస్తుంది.

నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యంపై దుష్ప్రభావం..

మామిడి పండ్లు మార్కెట్‌లోకి పోటెత్తుతున్నాయి. ఇప్పుడు వాటి సీజన్‌ కావడంతో వెల్లువలా వస్తున్నాయి. పండ్లను సహజసిద్ధానికి భిన్నంగా కృత్రిమ పద్ధతుల్లో మాగపెడుతుండడంతో అవి తిన్న జనం రోగాలపాలవుతున్నారు. కొందరు వ్యాపారులు సహజ రుచి, వాసన, నాణ్యత లేకుండా పక్వానికి రాకముందే ‘కాల్షియం-కార్బైడ్‌’ వంటి రసాయనాలతో మాగపెట్టి విక్రయిస్తున్నారు. దీంతో వినియోగదారులు రోగాల బారిన పడుతున్నారు. సీజన్ల వారిగా నిత్యం తనిఖీలు చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా విక్రయాలు చేపడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

బహిరంగ మార్కెట్లలో క్రయవిక్రయాలు..

మామిడి పండ్ల సీజన్‌ ఆరంభమవడంతో బహిరంగ మార్కెట్లలో క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. రంగారెడ్డి జిల్లా తో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో మామిడి పంట అధికంగా పండిస్తుంటారు. ఏటా వ్యాపారులు తొందరగా పండేలా మామిడిని ఇథిలిన్‌పౌడర్‌, కాల్షియం-కార్బైడ్‌ రసాయనాలతో మాగపెడుతుంటారు. సాధారణంగా కల్షియం-కార్బైడ్‌ను పరిశ్రమలలో లూబ్రికెంట్స్‌గా సుమారు 2000 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత కోసం వాడుతుంటారు.
అలాంటి కాల్షీయం-కార్బైడ్‌ను పండ్లు మాగబెట్టేందుకు వినియోగిస్తుండటం పెను ప్రమాదకరమేనని ఆరోగ్య నిపులు హెచ్చరిస్తున్నారు. పరిశ్రమలలో ఎక్కువ ఉష్ణోగ్రతల కోసం వాడే రసాయనాలను ప్రజల ఆరోగ్యంపై దుష్పప్రబావం చూపేలా ఉపయోగించడం సరైంది కాదంటున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి అలాంటి రసాయనాల వాడకాన్ని అరికట్టేలా చర్యలు చేపట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చూపును ఆకర్షించే రంగులతో కనిపించే వాటిని కొనుగోలు చేసి మోసపోవద్దని ప్రజలకు చెబుతున్నారు.

సహజ పండ్ల హార్మోన్‌ లా..?

మామిడి కాయలను త్వరగా పండించటానికి సాధారణంగా కాల్షియం-కార్బైడ్‌ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఇది తేమతో చర్య జరిపి ఎసిటిలీన్‌ వాయువును విడుదల చేస్తుంది. ఇది సహజ పండ్ల హార్మోన్‌ (ఇథలిన్‌) లాగా పనిచేసి పండిస్తుంది.
తక్కువ కాలం నిల్వ ఉంటుంది. 2, 3 రోజుల్లోనే పండు తొక్కపై మచ్చలు కనిపిస్తాయి. 10-13 శాతం కంటే ఎక్కువ బరువును కోల్పోతుంది. అంతేకాక నీళ్లలో వేస్తే కృత్రిమంగా పండించిన పండ్లు తేలిపోతాయి.

కృత్రిమంగా పండించిన పండ్లల్లో రుచిలో తేడా…!!

కృత్రిమంగా పండిన మామిడి పండ్ల రంగు పైకి పచ్చగా.. లోపల తెల్లగా లేదా పాలిపోయినట్లు ఉంటాయి. కృత్రిమంగా పండించిన పండ్లల్లో సహజమైన రుచి, సువాసన కూడా ఉండదు. పుల్లగా ఉండి తక్కువ రుచిని కలిగిస్తుంది.

ప్రమాదకరం..!.

ఇథిలీన్‌తో మాగబెడితే పండు ఉంటుంది. తియ్యగా ఉండి మంచి రుచిని కలిగిస్తుంది. ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. బరువు నష్టం కూడా 7-10 శాతం కంటే తక్కువగా ఉంటుంది.
కాల్షియం-కార్బైడ్‌లో ఆర్గానిక్‌ మరియు ఫాస్పరస్‌ వంటి హానికరమైన పదార్థాలు ఉంటాయి.కాని ఇలాంటి మామిడి డేంజర్..వీటిని తినడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో దీర్ఘ కాలంలో క్యాన్సర్‌ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. జీర్ణాశయం, కాలేయం దెబ్బతినడం, మూత్రపిండ నాడీ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!