అర్ధరాత్రి హైదరాబాద్ లో..
థార్ కారులో యువతి కిడ్నాప్.
అత్తాపూర్ లో ఘటన కలకలం..!!
జనం వాయిస్, హైదరాబాద్, మే 20:
హైదరాబాద్‌లో మళ్లీ మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అత్తాపూర్‌లోని జోయ్ హాస్పిటల్ ఎదురుగా మంగళవారం అర్ధరాత్రి ఓ యువతిని నంబర్ ప్లేట్ లేని థార్ కారులో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. పోలీసులు వెంబడించినా నిందితులు తప్పించుకున్నారు.
అందిన సమాచారం మేరకు
జోయ్ హాస్పిటల్ ఈఆర్ బ్లాక్ వెనుక భయంతో పరుగెత్తుకు వచ్చిన ఓ యువతి, ‘నన్ను కాపాడండి.. వాళ్లు నన్ను వెంబడిస్తున్నారు’ అంటూ బాత్రూంలో దాక్కుంది.
హాస్పిటల్ సిబ్బంది గమనించే లోపే, బయట ఆపి ఉన్న నంబర్ ప్లేట్ లేని థార్ కారు నుంచి కొందరు వ్యక్తులు వచ్చారు. ‘మా అమ్మాయి’ అంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి, యువతిని బెదిరించి బలవంతంగా కారులో ఎక్కించుకుని పరారయ్యారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు వెంటనే కారును ఛేజ్ చేశారు. అత్తాపూర్ నుంచి ఆరంఘర్ చౌరస్తా వరకు వెంబడించినా, నిందితులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు. కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడం కేసులో సవాల్‌గా మారింది.
అయితే పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలను గుర్తించినట్లుగా తెలుస్తుంది. కిడ్నాప్‌కు ముందు యువతి పక్కనే ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్లో రాత్రి సమయంలో వాటర్ బాటిల్, చాక్లెట్స్ కొన్నట్లు సీసీటీవీ లో రికార్డ్ అయింది. ఫోన్ పే ట్రాన్సాక్షన్ ఆధారంగా ఆమె ఫోన్ నంబర్‌ను పోలీసులు ట్రేస్ చేశారు.
నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.నంబర్ ప్లేట్ లేని వాహనాలపై నిఘా పెంచాం అని పోలీస్ అధికారులు అంటున్నారు.
పబ్లిక్ ప్లేస్‌లో జరిగిన ఈ ఘటనతో..?
హైదరాబాద్ అత్తాపూర్ నడిరోడ్డుపై, అందులోనూ హాస్పిటల్ లాంటి పబ్లిక్ ప్లేస్‌లో జరిగిన ఈ ఘటన నగరంలో మహిళల భద్రతపై మళ్లీ ఆందోళన రేకెత్తిస్తోంది. వెలుగులు జిమ్మే హైదరాబాద్‌లో చీకటి కోణాలు బయటపడుతుండడం కలవరపెడుతోంది. పోలీసులు నిందితులను త్వరగా పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
✒️.. PHANI KUMAR. M
సీనియర్ జర్నలిస్ట్.🦚🦚
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments