రేషన్ కార్డు ఉన్నవారికి ఇదే లాస్ట్ ఛాన్స్ ఈ పని చేయకపోతే కార్డు కట్..!
జనం వాయిస్, వెబ్ డెస్క్, జూలై 30:
తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి అలర్ట్. రేషన్ కార్డు ఉన్నవారు ఈకేవైసీ పూర్తి చేయడానికి కేవలం మూడు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కార్డు ఇనాక్టివ్ అయిపోవడం వల్ల రేషన్ సరుకులు తీసుకోలేరు. ఇ-కేవైసీ e-KYC ధృవీకరణను పూర్తి చేయడానికి ఈ నెల 31వ తేదీ వరకు రేవంత్ సర్కార్ గడువు ఇచ్చింది. అంటే కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.కేవైసీ పూర్తి చేసేందుకు మీరు మీ సొంత ఊరికి తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు. బయోమెట్రిక్ లేదా ఐరిస్ స్కానింగ్ కోసం మీ ఒరిజినల్ ఆధార్ కార్డుతో సమీపంలోని ఏదైనా రేషన్ షాపుకు లేదా మీసేవా కేంద్రానికి వెళితే సరిపోతుంది. ఈ ప్రక్రియ కోసం ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా కంప్లీట్ చేసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతీ లబ్దిదారుడు ఈ ప్రాసెస్ పూర్తి చేయాలి. 8 ఏళ్లుపైబడిన ప్రతీఒక్కరూ తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాలి. జులై 31లోగా పూర్తి చేయకపోతే రేషన్ సరుకులు నిలిచిపోతాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం త్వరలో పంపిణీ చేయనున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కూడా అందదు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments