EPAPER
Saturday, August 15, 2026
Google search engine

ఎర్రకోటపై జెండా ఎగరేసిన ప్రధాని మోడీ.

📰 Generate e-Paper Clip

ఎర్రకోటపై జెండా ఎగరేసిన ప్రధాని మోడీ.

వరుసగా 13వసారి జెండా ఆవిష్కరణ.
తొలిసారిగా పూర్తిస్థాయి వందేమాతర గీతాలపన.
పూలవర్షం కురిపించిన వాయుసేన హెలికాప్టర్లు.

జనం వాయిస్, న్యూఢిల్లీ,ఆగస్ట15:

దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య� వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజధాని దిల్లీలో ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. దిల్లీలోని ఎర్రకోటపై మోదీ వరుసగా 13వ సారి జాతీయ జెండా ఎగురవేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఈ వేడుకల్లో ఆలపించారు. అనంతరం జాతీయ గీతం ’జనగణమన’ను ఆలపించారు. ఆ సమయంలో వాయుసేన పూలవర్షం కురిపించింది. ఒక హెలికాప్టర్ జాతీయ పతాకాన్ని.. మరొకటి ’వందేమాతరం’ అని రాసి ఉన్న జెండాను మోసుకెళ్లాయి. ’వందేమాతరం’ గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గతేడాది నవంబర్ 7 నుంచి ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జాతీయ గీతం ’జన గణ మన’తో పాటు వందేమాతరానికి ప్రభుత్వం సమాన హోదా కల్పిస్తూ చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం.. ’వందేమాతరం’ని
అవమానించినా, ఆలపిస్తున్న సమయంలో ఆటంకం కలిగించినా ఇకపై చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు.
స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. ఇది భారతీయ వస్త్ర కళలు, సంస్కృతీ సంప్రదాయాలు, వైవిధ్యాన్ని చాటిచెబుతోంది. 22 విభిన్న ప్రాంతీయ వస్త్ర సంప్రదాయాలను తెలియజేసే డిజైన్‌లు అందులో కనిపిస్తున్నాయి.  చేతితో నేసిన ఈ వ�స్తాల డూడుల్ దేశవ్యాప్తంగా ఉన్న నేత కార్మికులు, రైతులు, బ్లాక్`ప్రింటర్ల సామÖహిక శ్రమను ప్రతిబింబిస్తోంది. జెండా ఎగురవేయడానికి ముందు ప్రధాని మోదీ రాజ్‌ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోట వద్ద గౌరవవందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలు ప్రారంభమైన సమయంలో వాయుసేన పూలవర్షం కురిపించింది. స్వాతంత్య� దినోత్సవం రోజున మోదీ జెండా ఎగురవేయడం ఇది 13వసారి కావడం విశేషం. జెండా ఎగురవేసిన అనంతరం ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఈ రోజు మనమంతా 80వ స్వాతంత్య� దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. ప్రతి హృదయంలో ’వందేమాతరం’ ధ్వనిస్తోంది. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. కొత్త తీర్మానాలతో సరికొత్త ఉత్సాహంతో దేశం ముందుకు సాగుతోంది. గతంలో ఐదు బలహీన దేశాల జాబితాలో ఉన్న భారత్.. 12 ఏళ్ల తర్వాత ఇప్ప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థగా మారింది‘ అని మోదీ అన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!