EPAPER
Saturday, September 12, 2026
Google search engine

గోదావరి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.

📰 Generate e-Paper Clip

గోదావరి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.

సుందిళ్ల బ్యారేజీ నుండి రామగుండం వరకు 5 కి.మీ. కరకట్ట నిర్మాణం చేపట్టాలి.

తాహాశీల్దర్ కు ఇచ్చిన వినతి పత్రం లో కోరిన మద్దెల దినేష్.

జనం వాయిస్, గోదావరిఖని, ఆగష్టు 26:

గోదావరి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారంగా సుందిళ్ల బ్యారేజీ నుండి రామగుండం వరకు 5 కి.మీ. కరకట్ట నిర్మాణం చేపట్టాలని కోరుతూ తాహసిల్దర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ ఒక ప్రకటన లో పేర్కొన్నారు. మంగళవారం ఆయన రామగుండం మండలం లోని తహాసీల్దర్ ఆఫీస్ కి వెళ్లి వినతి పత్రం ఇచ్చిన అనంతరం మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గోదావరి నది పరివాహక ప్రాంతం ఉందని. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ వరదల కారణంగా కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, మల్కాపురం, సప్తగిరి కాలనీ, ఉదయ్ నగర్, రెడ్డి కాలిని, ప్రశాంత్ నగర్, శ్రీనగర్ కాలనీ, గంగానగర్, పవర్ హౌస్ కాలనీ వంటి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి విడుదల మరియు భారీ వర్షాల వల్ల గోదావరి బ్రిడ్జ్ వద్ద నీటిమట్టం పెరిగి రాకపోకలు నిలిచిపోతోన్నయని, కావున ముంపు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని, వరద నివారణకు కరకట్ట ఏర్పాటు చేస్తామని గత పాలకులు హామీలు ఇచ్చారని , ఒకసారి రూ.130 కోట్లు, మరోసారి రూ.200 కోట్లు, ఇంకోసారి రూ.400 కోట్లు ఖర్చవుతుందని ప్రకటించడానికే పరిమితమై, ఆ తర్వాత మర్చిపోవడం ముంపు ప్రాంత ప్రజల దురదృష్టకరం అని ఆయన తెలిపారు. కరకట్ట నిర్మాణానికి భూసేకరణ, అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసి, నిర్మాణం చేపడితే ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడమే కాకుండా, గోదావరి తీర ప్రాంతం సుందరంగా తయారవుతుందని. దీని వల్ల ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కలగడమే కాకుండా పర్యాటకంగా అభివృద్ధి చెంది ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గోదావరి నది పరివాహక ప్రాంతం ఐన సుందిళ్ల బ్యారేజీ నుండి రామగుండం వరకు 5 కి.మీ. కరకట్ట నిర్మాణానికి వెంటనే భూసేకరణ చేపట్టి, సమగ్ర అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి, కరకట్ట నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అయన ప్రభుత్వన్ని డిమాండ్ కోరారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!