EPAPER
Saturday, September 12, 2026
Google search engine

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి.

📰 Generate e-Paper Clip

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి.

రాజీ మార్గమే రాజా మార్గం

ఎస్సై ఎం సాంబమూర్తి

జనం వాయిస్, మహాదేవపూర్, ఆగస్టు 29:

మహాదేవపూర్ ఎస్సై ఎం సాంబమూర్తి మాట్లాడుతూ  భూపాలపల్లి కోర్టు ఆధ్వర్యంలో లోక్ అదాలత్ కార్యక్రమం ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 12, 2026 వరకు నిర్వహించనున్నట్లు  ఎస్సై ఎం. సాంబమూర్తి తెలిపారు.
మహదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు తమపై నమోదైన లేదా పెండింగ్‌లో ఉన్న రాజీకి అవకాశం ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు.
లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో కేసులను పరిష్కరించుకోవడంతో పాటు సమయం, ఖర్చు ఆదా అవుతుందని, పెండింగ్ కేసులకు త్వరితగతిన పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని ఎస్సై పేర్కొన్నారు.కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, రాజీకి అవకాశం ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని మహదేవపూర్ ఎస్సై ఎం. సాంబమూర్తి కోరారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!