ఇంటి నంబర్ల కేటాయింపులో అక్రమాలు.. వార్డు సభ్యుడి సస్పెన్షన్.
ధర్మారం 11వ వార్డు సభ్యుడు నూనె సాయి గణేష్‌పై చర్యలు
పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి
జనం వాయిస్, పెద్దపల్లి, అక్టోబర్ 27:
ధర్మారం గ్రామపంచాయతీలో ఇంటి నంబర్లు, అసెస్మెంట్ నంబర్ల కేటాయింపులో అక్రమాలకు సంబంధించి 11వ వార్డు సభ్యుడు నూనె సాయి గణేష్‌ను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 2026–27 డిమాండ్ రిజిస్టర్లో నంబర్ల నమోదుపై వచ్చిన ఫిర్యాదుల మేరకు డివిజనల్ పంచాయతీ అధికారి విచారణ చేపట్టారని పేర్కొన్నారు. విచారణ నివేదికలో వార్డు సభ్యుడు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలిందని తెలిపారు. దీంతో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 37(6) ప్రకారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. క్రమశిక్షణ చర్యల ప్రక్రియ పూర్తయ్యే వరకు లేదా ఆరు నెలల వరకు, ఏది ముందైతే అప్పటివరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఈ వ్యవహారంపై ధర్మారం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నంబర్ 204/2026తో కేసు నమోదైనట్లు తెలిపారు. ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments