ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- రామగుండం క్యాంప్ ఆఫీసులో ఘనంగా నిర్వహణ.
- కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన నాయకులు.
జనం వాయిస్, రామగుండం, నవంబర్ 08:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను రామగుండం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేస్తూ నాయకులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సేవా సమితి అధ్యక్షురాలు మనాలి ఠాకూర్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.

Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments