ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు న్యాయం చేయాలి.
గ్రీవెన్స్ డేలో ఫిర్యాదులు స్వీకరించిన సీపీ అంబర్ కిషోర్ ఝా.
జనం వాయిస్, రామగుండం, నవంబర్ 09:
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని, చట్టపరిధిలో వాటికి సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను సీపీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదుపై సమగ్రంగా విచారణ జరిపి, వాస్తవాలను పరిశీలించాలని, అర్హులైన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే స్పందించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం, విశ్వాసం పెంపొందించేలా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మినిస్ట్రేషన్) కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments