EPAPER
Wednesday, November 11, 2026
- Advertisment -spot_img

గోదావరిఖనిలో అర్ధరాత్రి పేకాట స్థావరంపై పోలీసుల దాడి.

📰 Generate e-Paper Clip

గోదావరిఖనిలో అర్ధరాత్రి పేకాట స్థావరంపై పోలీసుల దాడి.

  • 10 మంది అరెస్ట్.. రూ.1.36 లక్షల నగదు, 10 సెల్‌ఫోన్లు స్వాధీనం.

జనం వాయిస్, గోదావరిఖని, నవంబర్ 11:

గోదావరిఖనిలో అక్రమ పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్, వన్‌టౌన్ పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఐ.బీ. కాలనీలోని వినాయక్ రెసిడెన్సీ లాడ్జిలో మంగళవారం అర్ధరాత్రి నిర్వహించిన ఈ దాడిలో డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కలాట ఆడుతున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,36,130 నగదు, 10 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట నిర్వహిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు పోలీస్ కమిషనర్ ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్/నార్కోటిక్ ఏసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ దాడి చేపట్టారు. గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ దీకొండ రమేష్, సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఎస్.ఎం. ఖాన్ (ఎన్టీపీసీ సండే మార్కెట్), టి. నర్సింగరావు (జంగాం), పి. తిరుపతి (పవర్‌హౌస్ కాలనీ), ఎం. కుమార్ (ప్రగతినగర్), కె. కిరణ్ (రామగుండం), వి. సతీష్ (బాపూజీనగర్), ప్రవీణ్ (గౌతమీనగర్), ఆర్. మణి (మార్కండేయ కాలనీ), ఎస్.కె. భాషి (మార్కండేయ కాలనీ), కె. రాజ్‌కుమార్ (తిలక్‌నగర్) ఉన్నారు. పట్టుబడిన వ్యక్తులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, సెల్‌ఫోన్లను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్రమంగా పేకాట, జూదం నిర్వహించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!