ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు రైతుల నిరసన సెగ!
20 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ నిలదీత భోజనానికి పిలిస్తే.. నేనే పది మందికి అన్నం పెడతానన్న రైతు
జనం వాయిస్, ఆలేరు, నవంబర్ 12:
ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. గత ప్రభుత్వం నిర్మించిన గోదామును ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై రైతులు నిలదీశారు. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వడ్లు తడుస్తూ, ఎండుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
20 రోజులుగా కొనుగోళ్లు లేవంటూ ఆగ్రహం
మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నామని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వర్షాలకు ధాన్యం తడుస్తూ, ఎండకు ఎండుతూ నాణ్యత దెబ్బతింటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే 20 రోజులుగా వడ్లు ఎందుకు కొనుగోలు చేయడం లేదంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు.
భోజనానికి పిలిస్తే రైతు ఘాటు సమాధానం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భోజనం చేద్దామని పిలవగా, ఓ రైతు స్పందిస్తూ.. “నేనే పది మందికి అన్నం పెడతాను” అంటూ సమాధానమిచ్చినట్లు సమాచారం. రైతుల ధాన్యం కొనుగోళ్ల సమస్య పరిష్కారం కాకపోవడంతో వారి ఆగ్రహం ఈ ఘటనలో స్పష్టంగా కనిపించింది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments