EPAPER
Friday, November 13, 2026
- Advertisment -spot_img

బావోలి ఆర్ట్ సంగం చైర్‌పర్సన్‌గా అల్లు స్నేహారెడ్డి

📰 Generate e-Paper Clip

బావోలి ఆర్ట్ సంగం చైర్‌పర్సన్‌గా అల్లు స్నేహారెడ్డి

జనం వాయిస్, హైదరాబాద్, నవంబర్ 12:

భారతదేశంలో తొలిసారిగా నిర్వహించనున్న స్టెప్‌వెల్ ఆర్ట్ బినాలే ‘బావోలి ఆర్ట్ సంగం’లో అల్లు స్నేహారెడ్డి కీలక బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగం చైర్‌పర్సన్‌గా ఆమె నియమితులయ్యారు. ఫ్యాషన్, కళలు, సంస్కృతిపై ప్రత్యేక ఆసక్తి కలిగిన అల్లు స్నేహారెడ్డి ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం విశేషం.

భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయ వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దేశంలోని చారిత్రక మెట్ల బావుల (స్టెప్‌వెల్స్) విశిష్టత, అద్భుతమైన నిర్మాణశైలి, చారిత్రక ప్రాధాన్యతను ఈ వేదిక ద్వారా చాటిచెప్పనున్నారు. నీరు, కళలు, నాగరికత మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రజలకు వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో అల్లు స్నేహారెడ్డి భాగస్వామ్యం భారతీయ కళా వారసత్వంపై మరింత అవగాహన కల్పించేందుకు దోహదపడనుంది. బావోలి ఆర్ట్ సంగం 2026 డిసెంబర్ 1 నుంచి 2027 జనవరి 10 వరకు జరగనుంది. ఈ వేడుకలో భారతీయ కళలు, సంస్కృతి, వారసత్వ సంపదను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!