ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్.
జనం వాయిస్, హుస్నాబాద్, జూలై 16:
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలనే కాంగ్రెస్ కుట్రకు నిరసనగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి చిత్రపటానికి రక్తంతో అభిషేకం చేస్తూ మా రక్తం కూడా ఇస్తున్నాం మా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయండి అని డిమాండ్ చేశారు స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ సావుల ఆదిత్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ అడుగుతున్న రైతులను రక్తం చల్లుకుని పంటలు పండించండి అన్నారు కదా మేము కూడా రక్తం పిండి మీ రక్త దాహాన్ని తీర్చుతాం పెండింగ్లో ఉన్న 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టి బీసీ ఈ బీసీ విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించాలని తద్వారా వారి కుటుంబాలను ఆర్థికంగా సామాజిక ఉన్నతంగా నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపన్నుతున్నదని ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీఎం చిత్రపటానికి రక్తాభిషేకం చేసే నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ సావుల ఆదిత్య మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ లపై ఆధారపడి చదువుకుంటున్నారని కానీ ప్రభుత్వం సరైన సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని కారణంగా 11000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రతి యేట 2 లక్షల మంది విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నారని 4.5 మంది సర్టిఫికెట్స్ తీసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు ఇక్కడి విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వలసవెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు గతంలో ఉన్న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తుంగలో తొక్కుతూ పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నదని మా ప్రభుత్వంలో బకాయిలు చెల్లించడంతో పాటుగా గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి ప్రతి నెల ఫీజులు చెల్లిస్తామని చెప్పిన నేటి ముఖ్యమంత్రి తానే విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఈ విషయం కోర్టు మెట్లు ఎక్కిందనీ అన్నారు
ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకంలో విద్యార్థులు బలి అవుతున్నారని బడ్జెట్ కాలేజిలు సైతం మూతపడుతున్నాయని పొట్టకూటి కోసం లెక్చరర్ గా మారిన నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు రీయింబర్స్ మెంట్ స్కాలర్షిప్స్ అనేవి విద్యార్థుల హక్కు అని ప్రభుత్వం వేసే బిక్ష కాదన్నారు రీయింబర్స్ మెంట్ కోసం అడిగితే విద్యార్థులపై ఉక్కుపాదం మోపుతున్నారని నిరసన చేస్తే లాఠీచార్జీలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని కానీ తెలంగాణ విద్యార్థులకు ఇవి కొత్తేమీ కాదన్నారు రేవంత్ రెడ్డి మాట తప్పారని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి అంకురార్పణ చేస్తామని అన్ని కళాశాల ప్రాంగణాలు విశ్వవిద్యాలయాలు మరోసారి ఉద్యమ వేదికలై కాంగ్రెస్ పార్టీకి మరణశాసనం రాస్తాయన్నారు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా హాస్టల్ కన్వీనర్ రాజేష్
నగర ఉపాధ్యక్షుడు సంతోష్, అంజి, నగర సంయుక్త కార్యదర్శి రంజిత్ విద్యార్థులు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments