నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి.
బాధిత రైతు రాజమౌళిని ప్రభుత్వం ఆదుకోవాలి.
జనం వాయిస్, చిగురుమామిడి, మే..22:
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలోని నల్లల బావి సమీపంలో బుర్ర శ్రీను అనే రైతు పొలం వద్ద లూజ్ వైర్లతో ప్రతి సంవత్సరం ప్రమాదాలు జరుగుతున్నయని పలుమార్లు రైతులు విద్యుత్ శాఖ అధికారులు చెప్పిన పట్టించుకోవడంలేదని,వారి నిర్లక్ష్యం మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, విద్యుత్ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.ఇందుర్తి గ్రామానికి చెందిన నర్సింగోజు రాజమౌళి పశువుల పాక వద్ద జరిగిన షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో లక్ష ఇరవై వేల రూపాయల విలువచేసే చుడి గేదె తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుందని బాధిత రైతును ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని తోటి రైతులు కూన పెద్దన్న,బుర్ర శ్రీనివాస్,బందెల శ్రీనివాస్,సంధవేని మల్లయ్య తదితరులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రమాదంలో అక్కడ ఉన్న దాదాపు 500గడ్డి కట్టలు కాలిపోయాయని,గతంలో మోటర్లు పైపులు కూడా కాలిపోయిన సంఘటన ఉన్నాయని రైతులు చెప్పారు. గేదె 80శాతం పూర్తిగా మంటల్లో కాలిపోయిందని కోరారు.వెంటనే విద్యుత్ శాఖ ఉన్నత అధికారులు స్పందించి లూజ్ వైర్లను సరి చేయించి రైతుకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments