లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసిబి కి చిక్కిన జూనియర్ అసిస్టెంట్.
జనం వాయిస్, హైదరాబాద్, మే 04:
రాష్ట్రంలోఅవినీతి నిరోధక శాఖ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నప్పటికీ కొన్ని శాఖల్లో అధికారులు, సిబ్బంది తీరు మాత్రం మారడం లేదు. డబ్బులిస్తేనే పనవుతుందని, ఫైళ్లు కదులుతాయని మధ్యవర్తులతో చెప్పిస్తున్నారు. అడిగినంత సమర్పించుకుంటేనే పని జరుగుతుందని వసూళ్ల దందా సాగిస్తున్నారు. తాజాగా బోరబండలో లంచం తీసుకుంటూ ఓ అధికారిణి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. రోజుల వ్యవధిలోనే పలువురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటం కలకలం రేపుతోంది. బోరబండ జీహెచ్ఎంసీ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. జూనియర్ అసిస్టెంట్ శ్రీలత రూ.లక్ష లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. హౌస్ కన్స్ట్రక్షన్ కోసం ఓ వ్యక్తి నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేసిందని, ఇవాళ ఓ సూపర్ మార్కెట్ వద్ద జూనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని అధికారులు వివరించారు.




Recent Comments