EPAPER
Friday, October 16, 2026
Google search engine
- Advertisment -spot_img

తెలంగాణకు మరో దిగ్గజ కంపెనీ.. సీఎం రేవంత్‌తో హ్యుందాయ్ ప్రతినిధుల భేటీ.

📰 Generate e-Paper Clip

తెలంగాణకు మరో దిగ్గజ కంపెనీ.. సీఎం రేవంత్‌తో హ్యుందాయ్ ప్రతినిధుల భేటీ.

  • సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ప్రతినిధులు.
  • జహీరాబాద్‌లో రూ. 8,528 కోట్లతో ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదన.
  • ఈ కేంద్రం ద్వారా 4,275 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడి.
  • అనుమతులు వేగంగా జారీ చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్.
  • తెలంగాణలో కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్‌కు ఆహ్వానం.

జనం వాయిస్, తెలంగాణ, అక్టోబర్ 16:

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రాబోతోంది. ప్రపంచ ప్రసిద్ధ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ ఇండియా, రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రూ. 8,528 కోట్ల వ్యయంతో అత్యాధునిక రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ద్వారా సుమారు 4,275 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

శుక్రవారం హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఇంజినీరింగ్ ఎండీ చాంగ్యో చో నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. ఈ భేటీ సందర్భంగా తమ పెట్టుబడి ప్రణాళికలను సీఎంకు వారు వివరించారు. జహీరాబాద్‌లో నెలకొల్పబోయే ఆర్ అండ్ డీ కేంద్రం స్వరూపం, దాని ద్వారా లభించే ఉపాధి కల్పన వివరాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలియజేశారు.

హ్యుందాయ్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన అనుమతులను వెంటనే జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదే క్రమంలో, తెలంగాణలో కార్ల తయారీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయాలని హ్యుందాయ్ ప్రతినిధులను ఆయన ఆహ్వానించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అత్యంత అనుకూల వాతావరణం ఉందని, ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు.

ఈ భారీ పెట్టుబడితో జహీరాబాద్ ప్రాంతం ఆటోమొబైల్ హబ్‌గా మరింత అభివృద్ధి చెందనుండంటంతో పాటు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు గణనీయంగా మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!