EPAPER
Tuesday, October 13, 2026
Google search engine
- Advertisment -spot_img

సింగరేణి కార్మికులకు లాభాల బోనస్‌పై హర్షం.

📰 Generate e-Paper Clip

సింగరేణి కార్మికులకు లాభాల బోనస్‌పై హర్షం.

  • గోదావరిఖనిలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం.
  • కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మేయర్ మహంకాళి స్వామి.
  • 34 శాతం లాభాల వాటా ప్రకటించడం హర్షణీయం: కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ఎండీ ముస్తఫా.
  • కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 బోనస్‌పై హర్షం.

జనం వాయిస్, గోదావరిఖని, అక్టోబర్ 13:

సింగరేణి కార్మికులకు సంస్థ లాభాల్లో 34 శాతం వాటా, కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 బోనస్ ప్రకటించడంపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ ముస్తఫా ఆధ్వర్యంలో గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మహంకాళి స్వామి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ఎండీ ముస్తఫా మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. సంస్థ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికులకు లాభాల్లో 34 శాతం వాటా ప్రకటించడం వారి కష్టానికి దక్కిన గుర్తింపుగా అభివర్ణించారు. కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 బోనస్ ప్రకటించడం అభినందనీయమన్నారు. కార్మిక కుటుంబాల ఆర్థిక భద్రత, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు, సొంతింటి కల సాకారం చేసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సంతోషకరమన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వారసత్వ ఉద్యోగాల సమస్యను 15 రోజుల్లో పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించడం కార్మిక కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురింపజేసిందన్నారు. కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కాల్వ లింగస్వామి, బొంతల రాజేష్, మారెల్లి రాజిరెడ్డి, కార్పొరేటర్లు గట్ల రమేష్, తాళ్లపల్లి యుగంధర్, నెల్లికంటి రాము, దూళికట్ట సతీష్, ఫజల్ బేగ్, గడ్డం శ్రీనివాస్, దాసరి సాంబమూర్తి, సంతోష్ రావు, చుక్కల శ్రీనివాస్, కొమ్ము స్వప్న వేణు, తిరుపతి గౌడ్, రేణిగుంట్ల నిర్మల తిరుపతి, తిప్పరపు శ్రీనివాస్, కొప్పుల శంకర్‌తో పాటు సింగరేణి కార్మికులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!