EPAPER
Thursday, June 4, 2026
Google search engine

జస్ ప్రీత్ బూమ్రాకు హీరో రామ్ చరణ్ క్షమాపణ.!

📰 Generate e-Paper Clip

జస్ ప్రీత్ బూమ్రాకు హీరో రామ్ చరణ్ క్షమాపణ.!

జనం వాయిస్, వెబ్ డెస్క్, మే 24:

తెలుగు ప్రేక్షకులకు హిట్ సినిమాలు అందించిన బుచ్చిబా బు,సానా కాంబినేషన్‌ లో వస్తున్న మోస్ట్ అవే టెడ్ మూవీ “పెద్ది” ఆవాజ్ పేరుతో భోపా ల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హీరో రామ్ చరణ్, సినీ తార జాన్వి కపూర్, సంగీత దర్శకుడు  ఏఆర్ రెహమాన్ తదితరులు హాజరయ్యారు.

అయితే, శనివారం భోపాల్‌లో జరిగిన ఆ గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్ ఇప్పుడు సరికొత్త వివాదానికి, సోషల్ మీడియా షేక్‌అప్‌కు వేదికగా మారింది. ఒక్క మాట.. ఒకే ఒక్క చిన్న పొరపాటు ఇప్పుడు టాలీవుడ్ టు క్రికెట్ సర్కిల్స్ వరకు హాట్ టాపిక్‌గా మారింది.

పెద్ది’ సినిమాపై వివాదం మరింత వేడెక్కుతోంది! అసలు ఏం జరిగిందంటే భోపాల్ ఈవెంట్‌లో రామ్ చరణ్ స్టేజ్ ఎక్కి మాట్లాడుతుండగా, ఫ్లోలో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్రస్తావన వచ్చింది. అయితే, ఊహించని విధంగా చరణ్ నోటి వెంట బుమ్రాను ఫుట్‌బాల్ ప్లేయర్ అనే పదం వచ్చేసింది.అంతే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానించే ఒక గ్లోబల్ స్టార్.. ఇండియాలోనే మోస్ట్ పాపులర్ క్రికెటర్‌ను ఫుట్‌బాల్ ప్లేయర్ అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారింది. దాంతో క్రికెట్ ఫ్యాన్స్, నెటిజ న్లు మెగా హీరోపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు.ఇండియాలో ఉంటూ బుమ్రా ఎవరో తెలియదా? అని కొందరు, గ్లోబల్ స్టార్‌కి కనీస అవగాహన లేదా? అని మరి కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

ఇంత పెద్ద ఈవెంట్‌లో ఇలాంటి తప్పు దొర్ల డం సిగ్గుచేటు అంటూ టీవీలల్లో,సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రెండ్స్ క్రియేట్ చేశారు. క్షణాల్లో స్పందించిన చెర్రీ.. వివాదం పెద్దదవుతోం దని గమనించిన రామ్ చరణ్.. ఏమాత్రం ఈగోకు పోకుండా, ఈవెంట్ ముగిసిన వెంటనే తన అధికారిక సోషల్ మీడియా ఖా తా ద్వారా స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు.

అది కేవలం నోరు జారడం వల్ల జరిగిన పొరపాటు మాత్రమే. కొన్నిసార్లు ఫ్లోలో నేను పేర్లు, ప్రొఫెషన్స్ కన్ఫ్యూజ్ అవుతుం టాను. జస్‌ప్రీత్ బుమ్రా అంటే నాకు ఎనలేని గౌరవం. నేను ఆయన ఆటకు వీరాభిమానిని. ప్రతి భారతీయుడు గర్వపడేలా బుమ్రా మన దేశానికి ఎన్నో విజయాలు అందించా రు. నా పొరపాటుకు క్షమించండి అంటూ బుమ్రాను ట్యాగ్ చేశారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!