EPAPER
Tuesday, October 13, 2026
Google search engine
- Advertisment -spot_img

మరిపెడలో ఘోర రోడ్డు ప్రమాదం.

📰 Generate e-Paper Clip

మరిపెడలో ఘోర రోడ్డు ప్రమాదం.

బైక్ ను ఢీకొట్టిన లారీ,ఒకరు మృతి.

మరిపెడ,ఆగస్టు 09(జనం వాయిస్):

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.మృతుడు దుబ్బ తండాకు చెందిన భానోత్ వెంకట్రాం వయసు 45 సంవత్సరాలు.వ్యవసాయ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.ఆదివారం పని నిమిత్తం మరిపెడ బంగ్లాకు బైక్ పై వచ్చిన వెంకట్రాం పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నాడు.మరిపెడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపానికి చేరుకోగానే వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ అతను నడుపుతున్న బైక్ ను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో వెంకట్రాం రోడ్డుపై పడిపోయాడు.కింద పడిన వెంటనే లారీ చక్రం అతని తలపై నుండి వెళ్లడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

*డ్రైవర్ అరెస్టు:*
ప్రమాదం చేసిన వెంటనే లారీని ఆపకుండా డ్రైవర్ పారిపోయాడు.విషయం తెలుసుకున్న స్థానికులు,పోలీసులకు సమాచారం ఇచ్చారు.వెంటనే రంగంలోకి దిగిన మరిపెడ ఎస్సై సత్తిష్ బృందం లారీని వెంబడించి,ఎల్లంపేట స్టేజి సమీపంలో లారీని అడ్డగించి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

*రోడ్డు ఇరుకు కారణంగానే ప్రమాదాలు-ప్రజల ఆగ్రహం:*
ఈ ప్రమాదంతో తండలో తీవ్ర విషాదం నెలకొన్నది.వెంకట్రాం కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన వాహనదారులు,స్థానికులు రోడ్డు ఇరుకుగా ఉండడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మధ్యలో సెంటర్ డివైడర్ ఉండడం వల్ల రోడ్డు మరింత ఇరుకుగా మారిందని,దీంతో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని వాపోయారు.ఇదివరకు కూడా ఇదే ప్రాంతంలో చాలా ప్రమాదాలు జరిగాయని,ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని,అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజలు,సంబంధిత అధికారులను కోరుతున్నది ఒక్కటే వెంటనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టి ఇలాంటి ప్రమాదాలను నివారించాలని.రద్దీ ఎక్కువగా ఉండే ఈ రహదారిపై,రోజుకు వంధల్లో లారీలు,ద్వి చక్ర వాహనాలు తిరుగుతుంటాయని,సంబందిత అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు…


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!