జనగామలో కుంగిన చేతి బోరు పరిశీలన
- ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు.
- గ్రామస్థులకు ధైర్యం చెప్పిన మేయర్ మహంకాళి స్వామి.
జనం వాయిస్, రామగుండం, అక్టోబర్ 24:
రామగుండం పరిధిలోని జనగామలో శుక్రవారం కుంగిన చేతి బోరు ఘటనపై అధికారులు పరిశీలన చేపట్టారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు నగర మేయర్ మహంకాళి స్వామి, సింగరేణి ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్, శ్రీనివాస్‌తో పాటు సర్వే బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. చేతి బోరు కుంగిపోవడానికి గల కారణాలను గుర్తించేందుకు సర్వే బృందం అన్వేషణ ప్రారంభించింది. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి స్థానిక గ్రామస్థులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మేయర్ ఘటనకు సంబంధించిన పరిస్థితులను వివరించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సమస్యపై అధికారులు సమగ్ర పరిశీలన చేపట్టాలని సూచించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments