పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బాధ్యతలు స్వీకరించిన కొప్పుల వెంకట్ రెడ్డి.
రాజేంద్రనగర్ ఆర్డీఓగా పనిచేసిన కొప్పుల వెంకట్ రెడ్డికి పదోన్నతి.
జనం వాయిస్, పెద్దపల్లి, జూన్-15:

పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా కొప్పుల వెంకట్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)గా విధులు నిర్వహించిన కొప్పుల వెంకట్ రెడ్డికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పదోన్నతి లభించడంతో పెద్దపల్లి జిల్లాకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్న ఆయన అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బాధ్యతలు స్వీకరించి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులను కలుసుకున్న కొప్పుల వెంకట్ రెడ్డి, ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments